ఆంధ్రప్రదేశ్: ఏపీలో మద్యం షాపుల కేటాయింపు క్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల లాటరీ ద్వారా కేటాయింపు కోసం మొత్తం 89, 882 దరఖాస్తులు రాగా.. లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా.. పూర్తి బందోబస్తు నడుమ నిర్వహించిన ఈ లాటరీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలను తలపించింది. ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అయింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ రాష్ట్రాల నుంచి టెండర్లు వేసి వ్యాపారులు షాపులను దక్కించుకున్నారు. కేటాయింపు అనంతరం షాపులను పొందిన వారికి అప్పటికప్పుడే లైసెన్సులు అందజేయడం జరిగింది. లైసెన్స్ ఫీజులు వసూలు చేసి, అక్కడే నగదు లెక్కించి ఖజానాకు జమ చేశారు.
ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. నాన్-రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వం 1,797 కోట్ల ఆదాయం పొందింది. లైసెన్స్ ఫీజుల ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరింది.
ఈసారి మహిళలు, విద్యావంతులు మద్యం టెండర్లలో సత్తా చాటారు. మొత్తం షాపుల్లో 10.2 శాతం షాపులు మహిళల పేర్లకు లక్కీ డ్రాలో కేటాయించబడ్డాయి. విశాఖ, విజయవాడ, కృష్ణ జిల్లాల్లో మహిళలు అధిక సంఖ్యలో మద్యం షాపులు పొందడం గమనార్హం.
మద్యం షాపుల లాటరీలో సిండికేట్‌లు కూడా ప్రభావం చూపాయి. అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల అనుచరులు పెద్ద ఎత్తున షాపులను కైవసం చేసుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాడిపత్రి ప్రాంతంలో జేసీ వర్గానికి ఎక్కువ మద్యం షాపులు కేటాయించబడ్డాయి.
అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకు 3 నుంచి 5 వరకు షాపులు దక్కినట్లు సమాచారం. 50 నుంచి 100 షాపులకు దరఖాస్తులు చేసిన సిండికేట్‌కు ఐదు నుంచి 10 షాపులు దక్కినట్లు తెలిసింది. విశాఖ, విజయవాడ, కృష్ణ వంటి పలు జిల్లాల్లో మద్యం దుకాణాలను మహిళలు చేజిక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో ఏడు, విశాఖ జిల్లాలో 11 షాపులను మహిళా మణులు కైవసం చేసుకున్నారు. సిండికేట్‌గా ఏర్పడి 10 నుంచి 30 వరకు షాపులు వేసినా అదృష్టం తలుపు తట్టకపోవడంతో కొంతమంది దరఖాస్తుదారులు నిరాశతో వెనుదిరిగారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం, తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రూ.99కే కొన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే భారీగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
నూతన మద్యం పాలసీతో పెరిగిన రాష్ట్ర ఆదాయం, మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడంతో గణనీయంగా పెరిగిన దరఖాస్తులు. 2017-19వ సంవత్సరంతో పోల్చితే దుకాణాల సంఖ్య 22% తగ్గించగా, 18 శాతం పెరిగిన దరఖాస్తులు. 2017-19 సంవత్సరంలో రూ.1,422 కోట్ల రెవెన్యూ ఉండగా 2024-26 సంవత్సరానికి రూ.6,389 కోట్ల రెవెన్యూ గ్రోత్ నమోదు
మరోవైపు, విపక్షాలు అధికార పార్టీపై కక్షసాధింపు ఆరోపణలు చేస్తూ, మద్యం షాపులు కేటాయింపులో అవకతవకలు జరిగాయని అంటున్నాయి. సిండికేట్లు అధికార పార్టీలోని కొందరు వ్యక్తులు కట్టిపడేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.