బన్నీ-అట్లీ మూవీ.. రిలీజ్ టార్గెట్ ఫిక్స్!
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న AA22 సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మాస్, ఎమోషన్, టెక్నికల్ గ్రాండ్‌నెస్‌తో ఫుల్ ఓన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. గ్లింప్స్ వీడియోతోనే ఇండస్ట్రీలో హైప్ తెచ్చేసింది.
తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ 2026 డిసెంబర్ రిలీజ్ డేట్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారు. స్క్రిప్ట్ ఫైనల్, క్యాస్టింగ్, విజువల్ వర్క్‌లకు సంబంధించి ముందస్తు పనులు వేగంగా జరుగుతున్నాయి.
జూన్ నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందే ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయనున్నారు.
బన్నీకి జోడీగా బాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశముందని టాక్. ప్రియాంక చోప్రా, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కథలో మాఫియా అండ్ సై-ఫై యాంగిల్స్ మిక్స్ అవుతాయని సమాచారం.
ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. అట్లీ మార్క్ యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో వచ్చే ఈ సినిమా బన్నీకి మరో ఇండస్ట్రీ హిట్ తెస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.