fbpx
Wednesday, April 2, 2025
HomeMovie Newsపునర్జన్మ కాన్సెప్ట్‌తో బన్నీ అట్లీ సినిమా ఫిక్స్!

పునర్జన్మ కాన్సెప్ట్‌తో బన్నీ అట్లీ సినిమా ఫిక్స్!

allu-arjun-atlee-dual-role-rebirth-story-update

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రానప్పటికీ, బన్నీ – అట్లీ సినిమాపై రోజుకో ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంలో నడవనుందని టాక్. మగధీర, మనం లాంటి హిట్ సినిమాల మాదిరిగా ఇద్దరు పాత్రల్లో బన్నీ కనిపించే అవకాశముందని సమాచారం. ఒక పాత్ర పీరియాడిక్ షేడ్స్‌లో ఉండగా, మరో పాత్ర మోడ్రన్ మాస్ గెటప్‌లో ఉండనుందని అంటున్నారు.

ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలుండగా, కథ వినూత్నంగా ఉంటే బన్నీ మరోసారి జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అట్లీ మాస్ యాక్షన్ ఎమోషన్స్ మిక్స్‌లో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని ఫిలింనగర్ టాక్.

త్వరలో ఈ సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అప్పటివరకు బన్నీ ఫ్యాన్స్ ఈ అప్డేట్‌తో ఫుల్ ఖుషిగా ఉండొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular