ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఎంతో గ్రాండ్‌గా రూపొందనున్న ఈ మూవీ కథాపరంగా కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎంపిక కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే మృణాల్ ఠాకూర్ పేరు ఫిక్స్ అయినట్లు సమాచారం. మృణాల్ గతంలో ‘సీతారామం’, ‘హాయ్ నన్నా’ సినిమాలతో సౌత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ సినిమాలో అవకాశం దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు బిగ్ అడ్వాంటేజ్‌గా మారనుంది.
మరోవైపు, మరో హీరోయిన్‌గా మొదట దీపికా పదుకొనే పేరు చక్కర్లు కొట్టినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆమె స్థానంలో అనన్య పాండే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అనన్య ఇప్పటికే లైగర్ మూవీ ద్వారా సౌత్ ఆడియన్స్‌కు పరిచయమయ్యింది. అయితే ఆ సినిమా ఫలితం ఆశించిన మేరకు రాలేదు.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ లాంటి భారీ కాంబినేషన్‌లో అవకాశం రావడం అనన్యకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్నది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి మృణాల్, అనన్య ఇద్దరూ అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌లో ఫ్రెష్ పేరింగ్‌తో సందడి చేయబోతున్నారు. ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందనేది త్వరలోనే అధికారికంగా తెలుస్తుందని సమాచారం.