స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాలపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పుష్ప 2 బ్లాక్‌బస్టర్ విజయంతో ఆయన క్రేజ్ నేషనల్ లెవెల్‌కి పెరిగింది. తొలుత త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసినా, స్క్రిప్ట్‌పై మరింత కసరత్తు చేయాలని భావించడంతో అది ఆలస్యం అవుతోంది.
అయితే, మరో క్రేజీ కాంబో కుదిరినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్‌తో ఓ మాస్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తి కాగా, అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని టాక్.
ఇక ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనే అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రధాన కథానాయికగా ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. పుష్ప 2లో ఐటెం సాంగ్‌కు కాదనుకున్న జాన్వీ, ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.
అలాగే, ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారని సమాచారం. అట్లీ గత చిత్రాల్లో పనిచేసిన టెక్నీషియన్స్ చాలా మంది ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ స్క్రిప్ట్‌పై చర్చలు జరుపుతుండగా, త్రివిక్రమ్ మూవీ కంటే ముందు ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఈ క్రేజీ కాంబోపై త్వరలో అధికారిక సమాచారం రానుండగా, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మెప్పించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.