మూవీడెస్క్: అల్లు అర్జున్ కి కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పాపులారిటీకి ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’తో మరింత ఊపు వచ్చేసింది.
కేరళలో ఈ సినిమాకి భారీ స్థాయిలో షోలు ప్లాన్ చేస్తూ, ఫ్యాన్స్ లో ఉత్సాహం మోత మోగుతోంది.
మరీ ముఖ్యంగా మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సీనియర్ స్టార్స్ సినిమాలకి ఇచ్చే ప్రమోషన్ కంటే పెద్దగా ఈ సినిమాను విడుదల చేయాలని కేరళ డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే కేరళలో తెల్లవారు జామున 4 గంటల నుంచి ప్రత్యేక ఫ్యాన్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ షోలు కేవలం అభిమానుల కోసమే, అందులో మహిళా అభిమానుల కోసం ప్రత్యేక షోలు కూడా ఏర్పాటు చేశారు.
కొట్టరక్కారలోని థియేటర్లో ఉదయం 7 గంటలకు కేవలం మహిళా ఫ్యాన్స్ కోసం మాత్రమే ప్రదర్శనలు కొనసాగుతాయని తెలుస్తోంది.
కేరళ డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 1 రికార్డులను మించేందుకు ఈసారి భారీ ప్లాన్ చేశారు.
టికెట్ అమ్మకాలు కూడా మొదలై పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.
ఇదే సమయంలో పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ లేదా అజనీష్ లోకనాథ్ పనిచేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
డిసెంబర్లో రాబోయే ఈ సినిమా కోసం కేరళలో పుష్ప 2 పండగలా ఉంది, ఇక మరో నెలరోజుల్లో ఫీవర్ మరింత పెరగడం ఖాయమనే చెప్పాలి.