పాన్ ఇండియా క్రేజ్‌తో దూసుకుపోతున్న అల్లు అర్జున్, ‘పుష్ప 2’ తర్వాత తన కెరీర్‌లో నెక్ట్స్ లెవెల్ ప్లానింగ్‌లోకి వెళ్లిపోయారు. భారీ వసూళ్లు సాధించిన ‘పుష్ప’ సిరీస్ తర్వాత బన్నీ మార్కెట్ పెరిగినంత వేగంగా, సినిమాల స్పీడ్‌ను కూడా పెంచాలనుకుంటున్నారు.
ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి కమిట్ అయిన బన్నీ, అదే టైమ్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. నిర్మాత నాగవంశీ వివరణ ప్రకారం… ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్లాన్ అవుతున్నాయట.
అట్లీ సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళ్లినా, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా 2025 లోనే షూటింగ్ ప్రారంభించనుంది. పాన్ ఇండియా క్రేజ్‌ను నిలబెట్టుకోవాలంటే ఎక్కువగా స్క్రీన్‌పై కనిపించాల్సిన అవసరం బన్నీకి ఉంది.
గతంలో పుష్ప కోసం ఎక్కువ సమయం వర్క్ లో ఉన్న తాను ఇప్పుడు స్పీడ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మార్కెట్‌ను క్యాష్ చేసుకునే ఈ డెడ్‌లైన్ స్ట్రాటజీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ రెండు సినిమాలు మాస్, క్లాస్ ఆడియన్స్‌కు మిక్స్ అవుతాయని టాక్. అట్లీ స్టైల్‌లో బన్నీ మాస్ డైనమిజం, త్రివిక్రమ్ డైలాగ్ మ్యాజిక్‌తో మరోసారి అల్లు అర్జున్ 2025లో స్క్రీన్‌పై ఆల్ ఓవర్ గ్లామర్ గా కనిపించనున్నాడు.