మూవీడెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ విజయంతో ఏకంగా 1800 కోట్ల హీరోగా మారాడు.
సినిమా సౌత్ కన్నా నార్త్ ఇండియాలో ఎక్కువ వసూళ్లు సాధించి, బీ టౌన్‌లో బన్నీ క్రేజ్‌ను అమాంతం పెంచింది.
బాలీవుడ్‌లో హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా నిలిచి, అల్లు అర్జున్‌కు అక్కడ బలమైన ఫ్యాన్‌బేస్ ఏర్పడింది.
ఇప్పుడు ఆయన స్ట్రైట్ హిందీ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ భారీ మార్కెట్ వెనుక బన్నీ పదేళ్ల కష్టం ఉందని నిర్మాత బన్నీ వాసు తెలిపారు.
గత 10-15 ఏళ్లుగా అల్లు అర్జున్ తన సినిమాలను హిందీ బెల్ట్‌లో విడుదల చేస్తూ వచ్చారని, ఫలితం ఎలా ఉన్నా అక్కడ తన గుర్తింపును పెంచుకోవాలని ప్రయత్నించారని చెప్పారు.
టికెట్ రేట్లు తక్కువైనా, రిలీజ్ లిమిటెడ్ అయినా తన సినిమాలను అక్కడ ప్రదర్శించాలనే పట్టుదల చూపించారట.
ఈ ప్రయత్నం చివరకు పుష్ప సినిమా ద్వారా ఫలితాన్ని ఇచ్చిందని బన్నీ వాసు పేర్కొన్నారు.
ఇప్పుడు అక్కడ అభిమానులు బన్నీని వేరే లెవెల్‌లో ఆదరిస్తున్నారని తెలిపారు.
ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఫ్యాన్స్ ఈ విజయాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నారు.
ప్రస్తుతం పాన్-ఇండియా ట్రెండ్‌లో చాలా మంది హీరోలు తమ సినిమాలను నార్త్‌లో విడుదల చేస్తున్నారు.
కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా ఏళ్ల క్రితం నుంచే తన మార్కెట్‌ను బలపరిచేందుకు కృషి చేశారు.
ఇప్పుడు పుష్పతో ఆ ప్రయత్నం విజయవంతమై, భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.