హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం సందర్భంగా పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ వ్యవహారంపై ఆయన స్పందించారు.
అల్లు అర్జున్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని, చిన్నప్పటి నుంచి చెర్రీ, బన్నీలతో తనకు పరిచయం ఉందని సీఎం తెలిపారు.
అయితే, వ్యక్తిగత పరిచయం వేరని, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. పుష్ప-2 ప్రమోషన్ కు పోలీస్ గ్రౌండ్ కూడా అందుబాటులోకి తెచ్చామని, కానీ సంధ్య థియేటర్ ఘటన తీవ్రత నేపథ్యంలోనే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మద్దతుగా ఉండి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని సీఎం రేవంత్ వివరించారు.
తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నామని, బాలీవుడ్ తరహాలో ప్రపంచస్థాయి వనరులను హైదరాబాద్‌కు తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.
పరిశ్రమను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని సీఎం రేవంత్ తెలిపారు.