హైదరాబాద్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, అనంతరం విడుదల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సాంకేతిక కారణాల పేరుతో జైలు అధికారులు అర్జున్‌ను రాత్రంతా జైలులో ఉంచారు.
ఈ ఘటనపై అల్లు అర్జున్ తరఫు న్యాయవాది తీవ్ర విమర్శలు చేస్తూ, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా జైలు అధికారులు విడుదల చేయకపోవడం చట్టవ్యతిరేకమని అన్నారు.
బెయిల్ ఆర్డర్ కాపీ సాయంత్రం అందించినప్పటికీ, అల్లు అర్జున్‌ను అనవసరంగా జైలులో ఉంచడం చట్టబద్ధం కాదని ఆరోపించారు. సంబంధిత అధికారులపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఇక ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ కుటుంబం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆలస్యమైన విడుదల, అనవసర వివాదం అనేదానికి జైలు అధికారుల తీరే కారణమని అల్లు కుటుంబం భావిస్తోంది.