మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ 4’ షోలో అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ షోలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
అర్జున్ మాట్లాడుతూ, “నాకు చిరంజీవి గారంటే చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన అభిమానముంది. నేను ఆయనని ‘చిక్కు బాబాయ్’ అని పిలుస్తుంటాను.
ఆయనతో నాకు ఉన్న అనుబంధం 20 ఏళ్ల కంటే ఎక్కువకాలం కొనసాగుతోంది.
నా చిన్నతనంలోనే ఆయన నా జీవితంలో బలమైన ముద్ర వేశారు.
మెగాస్టార్ అనే స్టార్ ఇమేజ్ తో కాకుండా, వ్యక్తిత్వంలోనూ ఆయన గొప్పతనాన్ని చూసి ఫ్యాన్ అయ్యాను,” అని పేర్కొన్నారు.
అయితే, చిన్నతనంలో చిరంజీవి గారి వలన తనకు మధుర స్మృతులు ఉన్నాయని బన్నీ తెలిపారు.
మా కుటుంబంలోని చిన్న పిల్లలందరినీ, తమ్ముడితో పాటు నన్ను కూడా ఫారిన్ టూర్‌కు తీసుకెళ్లింది చిరంజీవి గారే.
ఆ సమయంలో 10 మంది పిల్లలను తీసుకుని వెళ్లడం చాలా పెద్ద విషయం.
ఆ టూర్ నాకు చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని దగ్గరగా తెలుసుకునే అవకాశం ఇచ్చింది, అన్నారు.