టాలీవుడ్: తెలుగు సినిమాల్లో వారసులు రావడం కొత్తేమి కాదు. అల్లు రామలింగయ్య కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించాడు. అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు అరవింద్ నటుడిగా చాలా తక్కువ సినిమాలు చేసి గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించాడు. తర్వాత జెనెరేషన్ లో అల్లు అర్జున్ హీరో గా ప్రయాణం మొదలుపెట్టి స్వయం కృషి తో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీ లో టాప్ హీరో రేంజ్ కి ఎదిగాడు. తర్వాత అల్లు శిరీష్ హీరో గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరో బ్రదర్ అల్లు బాబీ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా బాల నటి గా అడుగులు వేస్తుంది. వైవిధ్య సినిమాలు రూపొందించడం తో పాటు ఇప్పుడు ఇండస్ట్రీ లో పౌరాణికాలు మంచిగా తీయగల దర్శకులలో వినపడే డైరెక్టర్ గుణ శేఖర్ ప్రస్తుతం ‘శాకుంతలం’ అనే సినిమా రూపొందిస్తుండడం తెలిసిందే. ఈ సినిమాని తన సొంత బ్యానర్ లో రూపొందిస్తున్నాడు గుణ శేఖర్. సమంత ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాకుమారుడు ‘భరత’ పాత్రలో నటించడానికి అల్లు ఆర్హా ని ఎంచుకున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తమ కుటుంబం నుండి 4 వ జెనరేషన్ నుండి సినిమాల్లోకి వస్తున్న తమ కూతుర్ని ఇలాంటి సినిమా ద్వారా పరిచయం చేస్తున్నందుకు గుణ శేఖర్ కి ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్.