టాలీవుడ్: అల్లు అర్జున్ హీరోగా , సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమా గురించి ఈ వీక్ లో వరుసగా అప్ డేట్స్ ఇవ్వబోతున్నట్టు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. చెప్పినట్టే ఈరోజు సినిమాలో బన్నీ ప్రీ-ల్యూడ్ అని సినిమాలో బన్నీ కారెక్టర్ పుష్పరాజ్ కి సంబందించిన చిన్న వీడియో విడుదల చేసారు.
వీడియో లో బన్నీ ముఖానికి ముసుగు కప్పి ఉండి, చేతులు వెనక్కి కట్టి ఉండి అడవిలో పరిగెత్తే అల్లు అర్జున్ వీడియో విడుదల చేసారు. సీన్ చూస్తుంటే పోలీసులకి దొరికిన తర్వాత తప్పించుకునే బైట్ అని అర్ధం అవుతుంది. ఈ సినిమాలో గంధపు చెక్కలని స్మగ్గ్లింగ్ చేసే గ్యాంగ్ లో బన్నీ పాత్ర అని ముందే హింట్స్ ఇచ్చారు మేకర్స్. ఈ చిన్న వీడియో లో సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ విజువల్స్ ,సుకుమార్ టేకింగ్ అలాగే దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్ట్రాక్షన్ అని చెప్పవచ్చు .
ఈ సినిమాని రంగస్థలం తర్వాత సుకుమార్ మరో ఇండస్ట్రీ హిట్ కోసం అలాగే ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ చెయ్యడానికి ఎఫర్ట్స్ పెడుతున్నట్టు ఇదివరకే ఇంటర్వూస్ లలో బన్నీ మరియు సుకుమార్ తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక, విలన్ గా మలయాళ నేషనల్ అవార్డు విన్నర్ ఫాహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా నిర్మాణం అవుతున్న ఈ సినిమాని ఆగష్టు 13 న విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.