fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsఅల్లు శిరీష్ కొత్త సినిమా

అల్లు శిరీష్ కొత్త సినిమా

AlluSireesh LatestMovie Announcement

టాలీవుడ్: అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి మెగా హీరోల జాబితాలో చేరాడు అల్లు శిరీష్. 2013 లో గౌరవం సినిమాతో పరిచయం అయ్యాడు శిరీష్. 8 సంవత్సరాల్లో 5 సినిమాలు తీసాడు కానీ ఆశించిన హిట్ అయితే రాలేదు. ఇండస్ట్రీ కి పరిచయం ఒక కొత్త స్టోరీ తో అయినా మెప్పించలేకపోయారు. ఆ తర్వాత కామెడీ, లవ్ స్టోరీ, థ్రిల్లర్ సినిమాలు ట్రై చేసాడు కానీ వర్కౌట్ అవలేదు. చివరగా ‘ABCD – అమెరికన్ బార్న్ కన్ఫ్యూస్డ్ దేశి’ అనే మలయాళం సినిమాని అదే టైటిల్ తో రీమేక్ చేసినా కూడా శిరీష్ ని హిట్ వరించలేకపోయింది. దాదాపు రెండు సంవత్సరాలుగా శిరీష్ ఏ సినిమా చేయలేదు.

ఈ రోజు శిరీష్ దగ్గరి నుండి ఒక ప్రకటన వెలువడింది. గీతా ఆర్ట్స్ వారు GA2 పిక్చర్స్ బ్యానర్ పై ఒక సినిమాలో శిరీష్ హీరోగా రూపొందనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో శిరీష్ కి జోడీ గా అను ఇమ్మానుయేల్ నటిస్తుంది. కేవలం ప్రొడక్షన్ హౌస్, హీరో, హీరోయిన్ లతో ఒక షాడో పోస్టర్ రిలీజ్ చేసి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందించబోతున్నట్టు హింట్ ఇచ్చారు మేకర్స్. మే 30 వ తేదీన ఈ సినిమా గురించి మిగతా వివరాలు తెలియచేయనున్నట్టు తెలిపారు. అల్లు శిరీష్ 6 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ 30 వ తేదీన విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular