టాలీవుడ్: వరుసగా ఓటీటీ కంటెంట్ ని రూపొందిస్తున్న ఆహా వారు అమల పాల్ తో ఒక వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. ‘కుడి ఎడమైతే ‘ అనే టైటిల్ తో ఈ సిరీస్ ని రూపొందిస్తున్నారు. ఇందులో ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. ‘లూసియా’, ‘యూ టర్న్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రోజు ఈ సిరీస్ టీజర్ విడుదల చేసారు.
మీకెప్పుడైనా లైఫ్ లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్టు అనిపించిందా అని అమలా పాల్ వాయిస్ లో టీజర్ ఆరంభించారు. రెండు పారలల్ షాట్స్ లో అమల పాల్ మరియు రాహుల్ విజయ్ షాట్స్ ని చూపించారు. రెండు ఫ్రేమ్స్ లో సేమ్ సీన్స్ ని ఇద్దరివీ చూపిస్తారు. చివర్లో ఆక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడే సీన్స్ ఇద్దరివీ చూపించారు. మరి వీరిద్దరికీ ఉన్న సంబంధం ఏమిటీ ఒకేలా జరిగిన ఎక్స్ పీరియన్స్ ఇద్దరు ఎందుకు ఫేస్ చేసారు అనేది సిరీస్ చూస్తే అర్ధం అవుతుంది. మరో థ్రిల్లర్ సబ్జెక్టు తో ఈ సారి అలరించడానికి పవన్ కుమార్ ఈ సిరీస్ ని రూపొందించినట్టు అర్ధం అవుతుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జులై 16 నుండి ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది