టాలీవుడ్: ప్రస్తుతం 5 నెలల నుండి థియేటర్ లు మూత పడడంతో చిన్న సినిమాలకి ఓటీటీ లు వరం లా దొరికాయి. కొన్ని చిన్న సినిమాలకి థియేటర్ లో కూడా రానంత బజ్ వస్తుంది. ఈ సిట్యుయేషన్ ఇక ముందు కూడా ఇలాగే సాగేట్టు కనిపిస్తుంది, ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో. కొన్ని రోజులైతే ఓటీటీ లకోసం ప్రత్యేక సినిమాలు తీసే సమయం వచ్చేట్టు ఉంది. అంతే కాకుండా ఓటీటీ ల్లో వచ్చే సినిమాలకి ఫాన్స్ ప్రెషర్, ఫార్ములా లాంటి అడ్డంకులు లేకుండా డైరెక్టర్స్ కి కంటెంట్ విషయం లో ఫ్రీడమ్ ఉంటుంది. దాంతో కొత్త టాలెంట్ బయటకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ప్రస్తుతం ‘అమరం అఖిలం ప్రేమ‘- ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండడం అనే టాగ్ లైన్ తో ఒక సినిమా అల్లు వారి ఆహా ఓటీటీ లో సెప్టెంబర్ 18 న విడుదల అవబోతుంది. బాగా చదువుకునే ఒక నాన్న కూచి అయిన అమ్మాయి, ఆవారా గా తిరిగే ఒక అబ్బాయి, మొదట అసలు కన్నెత్తి కూడా చూడకుండా తర్వాత ఆ అబ్బాయే కావాలనే స్టేజ్ కి వచ్చిన అమ్మాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ట్రైలర్ లో చూపించిన కథ ఇదే. కథనం లో ఏదైనా కొత్తదనం కనపడితే మంచి గుర్తింపు లభిస్తుంది. లవ్ స్టోరీ ల్లో ఉన్న మేజిక్ ఏ అది. ఒక కథ ని ఎన్ని సార్లు చూపించిన అందులో ఉన్న అనుభూతి ని ఫీల్ చేయించగలిగితే అన్ని సార్లు ఆ కథ సూపర్ హిట్ అవుతుంది. విజయ్ రామ్ – శివ్ శక్తి సచ్ దేవ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లన చిత్రాలు బ్యానర్ పై వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ – విజయ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు, జోనాధన్ ఎడ్వర్డ్ దర్శకత్వం వహించారు. రాడాన్ సంగీతం అందించిన ఈ సినిమాకి చాలా రోజుల తర్వాత రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.