మూవీడెస్క్: శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా తమిళంలో తెరకెక్కిన అమరన్ తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది.
ఈ చిత్రం ప్రేమకథతో పాటు దేశభక్తి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివ కార్తికేయన్ ప్రదర్శన ప్రేక్షకులను మెప్పించగా, సాయి పల్లవి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తమిళనాట బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
తెలుగులో 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం, మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
లాంగ్ రన్‌లో తెలుగు రాష్ట్రాల్లో 50.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి, 28 కోట్ల షేర్ తీసుకురావడం విశేషం.
ఇతర సినిమాల పోటీ మధ్య ‘అమరన్’ నిలబడటమే కాకుండా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటి 22.50 కోట్ల ప్రాఫిట్ సాధించింది.
ఈ విజయం శివ కార్తికేయన్‌కు తెలుగులో కొత్త మార్కెట్‌ను తెరిచింది.
ప్రస్తుతం శివ కార్తికేయన్ మురుగదాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.
‘అమరన్’తో వచ్చిన ఈ క్రేజ్‌కి మరింత ఊపందించేలా ఈ కొత్త చిత్రం కూడా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.