ఏపీ: రాజధాని అమరావతి నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ పాల్గొన్నారు.
హడ్కో, అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. జనవరి 22న జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ నిధులకు అనుమతి లభించింది. ఇప్పుడా ఒప్పందానికి అధికారికత లభించడంతో అమరావతి అభివృద్ధికి ఊతం లభించినట్లైంది.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిధుల విడుదలపై కార్యాచరణ ప్రారంభించనుంది. ముఖ్యంగా అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ వంటి అంశాలకు ఈ రుణాన్ని వినియోగించనున్నారు.
అమరావతి అభివృద్ధికి నిధులపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ హడ్కో రుణం రావడంతో నూతన రాజధాని పనులు తిరిగి ఊపందుకునే అవకాశముంది.
చంద్రబాబు పాలనలో అమరావతి ప్రాధాన్యం మరింత పెరగనుంది. త్వరలోనే రాజధాని పనులను వేగవంతం చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.