అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి అభివృద్ధి దిశగా కొత్త ఊపొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనల ఫలితంగా అమరావతికి కేంద్రం నుంచి భారీ నిధులు విడుదలయ్యాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ మద్దతుతో రూ.4200 కోట్లను విడుదల చేయడం గమనార్హం.
రాజధాని అభివృద్ధిని గతి తప్పిన ప్రాజెక్టుగా మలచిన గత పాలన తర్వాత, చంద్రబాబు పాలనలో తిరిగి స్పూర్తి సంతరించుకుంటోంది. ఢిల్లీ పర్యటనల సందర్భంగా కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం, అమరావతి ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకుని చర్చించారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా కీలక పాత్ర పోషించారు.
కేవలం అమరావతికే కాదు, పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాల్లోనూ కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇప్పటికే కొన్ని వేల కోట్ల నిధులు విడుదల కాగా, మిగతా వాటిపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అనుభవంతో కేంద్ర సహకారం లభించడం కండీషన్ సర్కార్ విజయంగా పేర్కొంటున్నారు.
ప్రజల్లోనూ ఆశాభావం పెరిగింది. ‘‘చంద్రబాబు నిధుల కోసం వెళితే ఖాళీ చేతుల్తో రాడు’’ అనే నమ్మకాన్ని ఈ పరిణామాలు మరింత బలపరిచాయి. విపక్షాల విమర్శలకు ఇది సమాధానంగా మారింది.
తొలి మూడు నెలల్లోనే కేంద్రం నుంచి నిధుల జల్లు పడటం, అమరావతిలో అభివృద్ధి పనులకు ఊపిరి పడటం రాష్ట్ర పునర్నిర్మాణానికి మార్గం చూపుతోంది. ఇది ఆంధ్ర అభివృద్ధి గమనాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకొచ్చే తొలి మెట్టు.