అమరావతి: అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్, రణస్థలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ (JD) హర్షం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టులపై స్పందిస్తూ, అమరావతికి రైల్వే లైన్ సాధించడంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు చూపిన చొరవ అభినందనీయం అని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పట్టుదలతో కృషి చేస్తున్నారని, ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అనుసంధానానికి కీలకమని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రణస్థలం ఎలివేటెడ్ కారిడార్, అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టులు రాష్ట్రంలో రవాణా మార్గాలను అభివృద్ధి చేసేందుకు దోహదపడతాయని అన్నారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన వీవీ లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్, చంద్రబాబు గుణాత్మక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, వారిద్దరి నాయకత్వానికి తగిన గౌరవం అందించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మరింత మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.