fbpx
Saturday, January 18, 2025
HomeAndhra Pradeshరైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - పవన్ హర్షం

రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ – పవన్ హర్షం

amaravati-railway-project-pawan-kalyan-reaction

అమరావతి అనుసంధాన రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని ఆయన అన్నారు.

మొత్తం 57 కిలోమీటర్ల మేర రూ.2,245 కోట్ల వ్యయంతో అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఈ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ, నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల బ్రిడ్జితో పాటు, ప్రధాన నగరాలతో అమరావతిని అనుసంధానం చేస్తూ ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది.

మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను కూడా ఈ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా అనుసంధానం చేయడం విశేషమని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ప్రాజెక్టు అమరావతికి సుస్థిర అభివృద్ధి కలిగిస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తరచుగా అండగా నిలుస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular