fbpx
Sunday, January 19, 2025
HomeBusinessఅమెజాన్ నుండి ఆటో ఇన్సూరెన్స్!

అమెజాన్ నుండి ఆటో ఇన్సూరెన్స్!

AMAZON-ACKO-AUTO-INSURANCE

న్యూఢిల్లీ: అమెజాన్.కామ్ ఇండియన్ యూనిట్ గురువారం తాము భారత దేశంలో ఆటో ఇన్సూరెన్స్ ఇవ్వడం ప్రారంభించనుందని, తద్వారా భారతదేశం లో ఇ-కామర్స్ దిగ్గజం అందించే మొదటి సర్వీసుగా గుర్తింపు పొందుతుంది అని పేర్కొంది.

అమెజాన్ పే, ఇండియా యూనిట్ యొక్క చెల్లింపుల విభాగం, ప్రైవేట్ సంస్థ అక్కో జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి కార్ మరియు మోటారు-బైక్ భీమాను అందించనుందని కంపెనీ తన బ్లాగులో తెలిపింది.

భీమా ప్రస్తుతం అమెజాన్ యొక్క యాప్ లోను మరియు మొబైల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది.

అమెజాన్ యొక్క ప్రైమ్ లాయల్టీ ప్రోగ్రాం యొక్క వినియోగదారులకు- ఉచిత సినిమాలు మరియు మ్యూజిక్ స్ట్రీమింగ్‌తో పాటు కొన్న వస్తువులను వేగంగా డెలివరీ చేస్తామని హామీ ఇస్తున్నారు – ఈ వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు మరియు ఎక్కువ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.

అమెజాన్ ఈ ఆటో ఇన్సూరెన్స్ సేవను స్థానిక ప్రత్యర్థులైన పేటీఎం మరియు సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ పాలసీబజర్‌తో పోటీ పడనుంది. అమెజాన్ కు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular