చికాగో: అమెరికాలో వేలాదిగా దిగుమతయిన విదేశీ విత్తనాల అమ్మకాలపై ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నిషేధం విధించింది. వివరాల్లోకి వెళ్తె అమెరికాలోని రైతులకు వేలాదిగా దిగుమతైన విత్తనాల పార్సిల్స్ అందాయి, కాగా విత్తనాల ప్యాకెట్లను తాము ఆర్డర్ చేయలేదని వారు అమెజాన్‌కు తెలిపారు.
ఈ నేపథ్యంలో అక్రమంగా విదేశాల నుంచి దిగుమతయ్యే విత్తనాలను నిషేదిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అయితే ఎక్కువగా చైనా నుంచే దిగుమతైనట్లుగా తెలుస్తుంది. కాగా ప్యాకేజీలలో లభ్యమయ్యే విత్తనాలను ఉపయోగించొద్దని అమెరికా వ్యవస్తాయ విభాగం జులైలోనే హెచ్చరించింది. ఒకవేళ ఆ విత్తనాలను అమెరికన్ రైతులు ఉపయోగిస్తే దేశానికే ప్రమాదమని పేర్కొంది.
అయితే ఈ స్కామ్ జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, అమ్మకందార్లపై నిఘా పెట్టనున్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం ఈ ఆగస్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో వినియోగదారుల భధ్రతకు అమెజాన్ అధిక ప్రాధాన్యమిస్తుంది. కాగా వినియోగదారులకు చేరువకావడానికి అమెజాన్ సరికొత్త వ్యూహ్యాలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమెజాన్‌తో జతకట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.