న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అమెజాన్ కంపెనీ యొక్క నిల్వ సామర్థ్యాన్ని సుమారు 40 శాతం పెంచుకునే ప్రణాళికలను తెలిపింది. ఈ భారీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా, అమెజాన్ ఇండియా 11 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను కూడా తెరవనుంది. అయితే ప్రస్తుతం అమెజాన్ కు ఉన్న 9 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను కూడా ఇంకా భారీ స్థాయిలో విస్తరించబోతోంది.
అమెజాన్ యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు మరియు వేర్ హౌస్ సెంటర్లతో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. వీటితో పాటు కంపెనీ పదివేల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కూడా సృష్టించనున్నట్లు అమెజాన్ ఇండియా తన ప్రకటనలో తెలిపింది.
అమెజాన్ భారత విభాగ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా మాట్లాడుతూ, అమెజాన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మరియు వినియోగదారులకు సేవలనదించడంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
అదే సమయంలో ఫాస్ట్ డెలివరీతో వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. మహారాష్ట్ర, బీహర్, గుజరాత్, అసోం, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమెజాన్ తన ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది.