వాషింగ్టన్: ఇటీవల అమెరికా కొవాగ్జిన్ పై సంచల వ్యాఖ్యలు చేసింది. అలాగే సదరు వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్వో గుర్తింపు కూడా లేదని వ్యాఖ్యలు వచ్చాయి. ఇదే తరుణంలో దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాను అభివృద్ది చేసిన సంగతి తెలిసిదే.
ఇదిలా ఉండగా తాజాగా కోవాగ్జిన్ తీసుకున్న భారతీయ విద్యార్థులకు అమెరికాలో అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ వేసుకున్న భారతీయ విద్యార్ధులపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ అమెరికా నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో అమెరికా వెళ్ళాలని ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి లేకపోవడంతో ఇప్పటికే పలు దేశాలు కొవాగ్జిన్‌పై ఆంక్షలను విధించిన సంగతి విదితమే. అయితే అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను మాత్రమే వినియోగిస్తున్నారు. అయితే డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు లేని వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసుకున్నప్పటికీ కొన్ని దేశాలలో వారిని “అన్‌వాక్సినేటెడ్” గానే పరిగణిస్తున్నారు.