అంతర్జాతీయం: పహల్గాం దాడిపై భారత్‌కు అమెరికా సంపూర్ణ మద్దతు
భారత్‌కు అండగా ట్రంప్, అమెరికా విదేశాంగ శాఖ
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam) దాడిపై భారత్‌కు అమెరికా (USA) సంపూర్ణ మద్దతు తెలిపింది. వాషింగ్టన్ నుంచి వచ్చిన రెండు కీలక పరిణామాలు దీన్ని స్పష్టం చేశాయి.
ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టమైన ప్రకటన చేస్తే, మరోవైపు విదేశాంగ శాఖ ప్రతినిధి పాక్ జర్నలిస్టుకు గట్టి సమాధానం ఇచ్చారు. ఈ రెండు ఘటనలతో పాక్‌కు (Pakistan) తీవ్ర నిరాశ ఎదురైంది.
‘‘ఇది ఉగ్రదాడే’’: ట్రంప్
పహల్గాం దాడిపై ట్రంప్ సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో స్పందిస్తూ,
“ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా సంపూర్ణ మద్దతుగా నిలుస్తుంది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ప్రధాని మోదీ (Modi), భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది” అన్నారు.
పాక్ జర్నలిస్టు ప్రశ్నను తోసిపుచ్చిన అమెరికా ప్రతినిధి
పాక్ జర్నలిస్టు అడిగిన ఒక ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామ్మీ బ్రూస్ (Tammy Bruce) గట్టిగా స్పందించారు.
“ఈ అంశంపై నేను ఏమీ వ్యాఖ్యానించను. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్, సెనేటర్ మార్కో రూబియో (Marco Rubio) స్పందించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. దాడి చేసినవారికి తగిన శిక్షపడాలి,” అని చెప్పారు.
పాక్ హస్తంపై స్పందించాలంటూ వచ్చిన ప్రశ్నకు కూడా ఆమె స్పందన పాక్ కు నిరాశపరిచేలా ఉండింది.
“పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నాం. జమ్మూకశ్మీర్‌పై ఎటువంటి అధికారిక పోజిషన్ మేము తీసుకోలేదు,” అని తేల్చేశారు.
న్యూయార్క్ టైమ్స్ మీద అమెరికా ప్రభుత్వ మండిపాటు
పహల్గాం దాడిపై న్యూయార్క్ టైమ్స్ (New York Times) చేసిన వార్తా కవరేజ్ పట్ల అమెరికా ‘హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ మెజార్టీ’ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆ పత్రిక దాడి చేసిన వారిని “టెర్రరిస్టులు (Terrorists)”గా కాకుండా “మిలిటెంట్లు (Militants)”గా అభివర్ణించింది. వార్తలో కూడా “గన్‌మెన్‌లు (Gunmen)” అనే పదాలను వాడటం పట్ల మండిపడింది.
ఒక క్లిప్పింగ్‌ను ఎర్ర అక్షరాల్లో సరిచేసి కమిటీ తన అధికారిక X ఖాతాలో పోస్టు చేసింది.
“హే న్యూయార్క్ టైమ్స్! ఈ సారికి మేమే నీ తప్పు సరిదిద్దాము. ఇది ఉగ్రదాడే. భారత్, ఇజ్రాయెల్‌లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు నిజాలను దాచేస్తారు,” అంటూ ఘాటుగా స్పందించింది.