న్యూయార్క్: American Elections 2024 మొదలు! కాగా, ఈ ఎన్నికలో కమలా హారిస్ మరియు డొనాల్డ్ ట్రంప్ (Trump vs Harris) మధ్య పోటీ ఉత్కంఠగా ఉంది.
పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్, నెవాడ, అరిజోనా, జార్జియా, మరియు నార్త్ కరోలినా వంటి స్వింగ్ స్టేట్స్ ఈ ఎన్నిక ఫలితాన్ని ప్రభావితం చేయనున్నాయి.
ట్రంప్‌కు 43 శాతం మద్దతు ఉండగా, గతంలో ఎప్పుడూ 50 శాతం దాటలేదు.
ముఖ్యంగా నిర్ణాయక అంశాలు నాలుగు ఉన్నాయి – ఆర్థిక వ్యవస్థ, వలస సమస్యలు, గర్భస్రావ హక్కులు, మరియు ప్రజాస్వామ్యం రక్షణ.
ప్రస్తుత పరిస్థితి 60-70 శాతం అమెరికన్లు దేశం సరైన మార్గంలో లేదని భావిస్తున్నారు, ఇది హారిస్‌కు ప్రతికూలమని అర్థం.
ఈ సందర్భంలో, మామూలుగా ప్రజలు చాంలెంజర్‌ను మద్దతు ఇస్తారు. ఆర్థిక పరంగా ట్రంప్‌కు 15 పాయింట్ల ఆధిక్యత ఉంది.
బైడెన్ హయాంలో 10-40 శాతం వ్యయాలు పెరిగాయి. వలస నియంత్రణలో కూడా ట్రంప్ పై మెరుగైన అభిప్రాయం ఉంది.
హారిస్ గర్భస్రావ హక్కుల పరంగా మహిళా ఓటర్లలో 15 పాయింట్ల ఆధిక్యంలో ఉంది.
అమెరికా ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదమని చాలామంది భావిస్తుండగా, హారిస్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రతిజ్ఞ చేసింది.
హారిస్ గెలిస్తే, ట్రంప్‌ను నమ్మకం కోల్పోయినవారిని కలుపుకొని ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా ఉంటుంది.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం American Election Results పై ఆసక్తిగా ఎదురు చూస్తోంది.