మూవీడెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ గతంలో వచ్చిన లాల్ సింగ్ చద్దా చిత్రంతో ఆశించిన విజయం సాధించలేకపోయారు.
ఆ సినిమా నిరాశపర్చడంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌ను మలుపు తిప్పే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అమీర్ ఖాన్ సినిమా చేయనున్నారన్న టాక్ బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వంశీ పైడిపల్లి ఒక పర్‌ఫెక్ట్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసి, దిల్ రాజుకు నేరేట్ చేసినట్లు సమాచారం.
ఆ కథకు అమీర్ ఖాన్ సరిపోతారని, ఆయన నటనతో పాత్రకు మరింత బలాన్నిస్తారని దిల్ రాజు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ముడిపెట్టే పనిలో వంశీ పైడిపల్లి, దిల్ రాజు బిజీగా ఉన్నారని టాక్.
త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదివరకు విజయ్ నటించిన వారసుడు సినిమాతో మంచి గుర్తింపు పొందిన వంశీ, బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
షాహిద్ కపూర్‌తో సినిమా అనుకున్నప్పటికీ, అది జరుగలేదు. అయితే, అమీర్ ఖాన్‌తో క్రేజీ ప్రాజెక్ట్ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే, వంశీ పైడిపల్లి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తెలుగు డైరెక్టర్ల లిస్ట్‌లో చేరనున్నారు.