fbpx
Sunday, November 24, 2024
HomeNationalఅమిత్ జోగి మార్వాహీ శాసనసభ నామినేషన్ తిరస్కరణ

అమిత్ జోగి మార్వాహీ శాసనసభ నామినేషన్ తిరస్కరణ

AMIT-JOGI-NOMINATION-REJECTED

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని మార్వాహీ రిజర్వుడ్‌ శాసనసభ స్థానానికి నవంబర్ 3వ తేదీన జరగనున్న ఉప ఎన్నికలో పోటీకి దిగుతున్న జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌(జే) అధినేత, దివంగత సీఎం అజిత్‌ జోగీ తనయుడు అమిత్‌ జోగీ నామినేషన్‌ శనివారం తిరస్కరణకు గురైంది.

అమిత్ జోగి తాను సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేశారు. అమిత్‌ జోగీ గిరిజనుడు కాదని ఈ విషయంలో అక్టోబర్‌ 15న ఉన్నత స్థాయి సర్టిఫికేషన్‌ పరిశీలన కమిటీ తేల్చిచెప్పింది. ఆయన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. దీని ఆధారంగా∙అమిత్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు.

ఇదే ఉప ఎన్నికలో బరిలోకి దిగుతున్న అమిత్‌ జోగీ భార్య రిచా నామినేషన్‌ను కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కుల దృవీకరణ పత్రం కారణంగానే తిరస్కరించారు. అజిత్‌ జోగీకి కంచుకోట అయిన చత్తీస్ఘడ్ మార్వాహీ అసెంబ్లీ స్థానంలో ఈసారి వారి కుటుంబ సభ్యులెవరూ పోటీపడే అవకాశం లేకుండా పోయింది. అజిత్‌ జోగీ మరణంతో ఖాళీ అయిన మార్వాహీ అసెంబ్లీకి స్థానానికి నవంబర్‌ 3న ఉపఎన్నిక జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular