న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి ప్రాణాలను బలిగొంది. కమల్ రాణి వరుణ్ (62) ఈ ఉదయం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మరణించారు.
దేశంలో 17 లక్షల మందికి పైగా సోకిన కరోనావైరస్ తనకు కూదా సోకిందని, పరీక్షలో తనకు పాజిటివ్ తేలిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగుందని మంత్రి చెప్పారు, కాని “వైద్యుల సలహా మేరకు” ఆసుపత్రిలో చేరానన్నారు. ఈ రోజు దేశం 17 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులను నమోదు చేసింది – కేవలం రెండు రోజుల్లో 1 లక్ష మందికి పైగా సోకింది.
అమిత్ షా కొద్ది రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ఉంటుందని, మంత్రితో పరిచయం ఉన్న ఎవరైనా స్వీయ-నియంత్రణలో ఉండాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
“కరోనావైరస్ యొక్క ప్రారంభ లక్షణాలు కనిపించిన వెంటనే, నేను పరీక్ష చేయించుకున్నాను, ఆ నివేదిక పాజిటివ్ గా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది, కాని వైద్యుల సలహా మేరకు నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారంతా, దయచేసి మిమ్మల్ని మీరు స్వీయ నియంత్రణలో ఉంచుకోడి, లేదా కోవిడ్ పరీక్ష చేయించుకోవలని” మిస్టర్ షా ట్వీట్ ద్వారా తెలియజేశారు.