టాలీవుడ్: డైలాగ్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తరవాత ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ సినిమాకి మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. డైమండ్ రత్నబాబు అనే రైటర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా నుండి మొదటి పాటని ఈ రోజు బాలీవుడ్ మెగా స్టార్ – బిగ్ బి అమితాబ్ బచ్చన్ విడుదల చేసారు. ఇండియన్ సినిమా కి సంబందించిన గొప్ప వ్యక్తుల్లో ఉన్న మోహన్ బాబు, ఇళయరాజా కలిసి పని చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో రఘువీర గద్యం పాట విడుదల చేయనున్నట్టు తెలిపి టీం కి బెస్ట్ విషెస్ తెలియ చేసారు.
‘జయ జయ మహావీర మహాధీర ధౌరేయా’ అంటూ సాగే ఈ పాటని మేస్ట్రో ఇళయరాజా సంగీతంలో రాహుల్ నంబియార్ ఆలపించారు. శ్రీ రాముడి గొప్పతనాన్ని చెప్పే ఈ గద్యాన్ని పాట రూపంలో మలచి విడుదల చేసారు. ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో శ్రీకాంత్, ప్రగ్య జైస్వాల్, తనికెళ్ళ భరణి, అలీ, వెన్నెల కిశోరె, ప్రకాష్ రాజ్, రఘు బాబు, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్నారు.