టాలీవుడ్: బాహుబలి తర్వాత కేజ్రీ పాన్ ఇండియా హీరో గా ఎదిగిన ప్రభాస్ సినిమా అప్ డేట్స్ మామూలుగా లేవు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ అనే పీరియాడిక్ లవ్ స్టోరీ లో చేస్తున్నాడు. ఇది మినహాయిస్తే తర్వాతి సినిమాలు భారీ రేంజ్ లో రూపొందబోతున్నాయి. బడ్జెట్ మాత్రమే కాకుండా భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఆశ్చర్య పరుస్తుంది. ప్రభాస్ తన 21 వ సినిమాని మహానటి ద్వారా నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా తీసిన నాగ్ అశ్విన్ దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే దీపికా పదుకొనె ని హీరోయిన్ గా ప్రకటించారు. ఇపుడు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటించనున్నాడని ప్రకటించారు.
ఇంతకముందు అమితాబ్ బచ్చన్ ‘మనం’, ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమాల్లో నటించాడు. కానీ అవి అతిధి పాత్రలకే పరిమితం అయింది. ఈ సినిమాలో అమితాబ్ పాత్ర గురించి చెప్తూ ఇది అతిధి పాత్ర కాదని సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేసాడు. వైజయంతి మూవీస్ టాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలు తీసింది. వైజయంతి మూవీస్ వారు ఈ సంవత్సరం లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాని చాలా ప్రతిషాత్మకంగా రూపొందిస్తున్నారు. ఏ ఒక్క విషయం లో కూడా తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళకి శుభాకాంక్షలు చెపుతూ ఇంకో 50 సంవత్సరాలు ఇలాగే సినిమాలు తియ్యాలని అమితాబ్ తన ఆకాంక్ష ని తెలిపారు. ప్రభాస్ కూడా ‘చివరకి నా కల నిజం అవబోతోంది’ అని ట్వీట్ చేసాడు.