మూవీడెస్క్: ‘బేబీ’ బ్లాక్ బస్టర్ విజయంతో మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, తన కెరీర్‌ను మరింత స్ట్రాంగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
‘దొరసాని’తో హీరోగా పరిచయమైన ఆనంద్, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మరియు ‘బేబీ’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నాడు.
ఇటీవల విడుదలైన ‘గంగం గణేశా’ చిత్రం ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఆనంద్ తన ప్రయాణాన్ని కాస్త జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నాడు.
ప్రస్తుతం ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్యతో కలిసి ‘డ్యూయెట్’ అనే సినిమా చేస్తున్న ఆనంద్, మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు.
తనకి హిట్ ఇచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ దర్శకుడు వినోద్ ఆనంతోజుతో మరో ప్రాజెక్ట్ ఫైనల్ చేశాడు, ఇది ప్రొడక్షన్ దశలో ఉంది.
అలాగే ‘90s’ వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తో కూడా సినిమా కన్ఫర్మ్ అయింది.
ఈ రెండు ప్రాజెక్ట్స్ యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌లతో ఉండబోతున్నాయని సమాచారం.
విదేశాలలో సెటిల్ అవ్వాలని అనుకునే యువకుడి కథతో ఆదిత్య హాసన్ సినిమా ఉంటుందంట.
యూత్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా కథలు ఎంచుకుంటూ ఆనంద్ తన ఇమేజ్‌ని మెల్లగా పెంచుకుంటున్నాడు.
ప్రస్తుతం అతని చేతిలో ఉన్న మూడు సినిమాలు హిట్టయితే, కమర్షియల్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకునే స్కోప్ ఉంది.
మొత్తానికి, కెరీర్ విషయంలో ఆనంద్ ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడని అర్ధమవుతోంది.