fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsమిడిల్ క్లాస్ అబ్బాయిగా ఆనంద్ దేవరకొండ

మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఆనంద్ దేవరకొండ

 Anand Devarakonda SecondMovie Announcement

హైదరాబాద్: టాలీవుడ్ లో ఒక స్టార్ నిలదొక్కుకున్న తర్వాత వాళ్ళ కుటుంబం నుండి కొత్త తారలు వస్తూనే ఉంటారు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా అందుకు మినహాయింపు కాదు. చాల త్వరగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొరసాని‘ సినిమాతో హీరో రాజశేఖర్ కూతురు శివాత్మికతో పాటు ఆనంద్ దేవరకొండ పరిచయమయ్యాడు. ఈ సినిమా అంతగా ఆడకపోయినా ఆనంద్ దేవరకొండ తరువాతి ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నాడు. ఇపుడు తన రెండవ సినిమాని అనౌన్స్ చేసాడు.

తెలుగులో ‘లౌక్యం’ ‘శమంతకమణి’ ‘పైసా వసూల్’ వంటి చిత్రాలను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై అందించిన ప్రముఖ నిర్మాత ఆనంద్ ప్రసాద్ ఆనంద్ దేవరకొండతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వినోద్ ఆనంతోజు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా మెగాఫోన్ పట్టుకోబోతున్నారు . 96 , జాను ఫేమ్ వర్ష బొల్లమ్మ ఆనంద్ తో జోడి కట్టబోతుంది. ఇంకా ఈ సినిమాకి c /o కంచరపాలెం లాంటి సినిమాకి సంగీతం అందించిన స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular