టాలీవుడ్: టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి వరుస సినిమాలు చేస్తున్న హీరో ఆనంద్ దేవరకొండ. ‘దొరసాని’ సినిమాతో పరిచయం అయిన ఆనంద్ లాక్ డౌన్ సమయంలో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాని ఓటీటీ లో విడుదల చేసి మొదటి హిట్ టాక్ సంపాదించాడు. ఇపుడు సొంత బ్యానర్ అయిన కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘పుష్పక విమానం’ అనే మరో సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇవే కాకుండా మరో మూడు సినిమాలు మొదలు పెట్టాడు.
వీటితో పాటు ఈ రోజు ‘హైవే’ అనే మరో సినిమా మొదలు పెట్టాడు. కళ్యాణ్ రామ్ నటించిన ’18 ‘ సినిమాని డైరెక్ట్ చేసిన కే.వీ.గుహన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్ పై తలరి వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సైమన్ కింగ్ సంగీతంలో ఈ సినిమా రూపొందనుంది. పూర్తి థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.