టాలీవుడ్: విజయ్ దేవరకొండ సోదరుడి గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ‘దొరసాని’ సినిమాతో పరిచయం అయ్యాడు ఆనంద్ దేవరకొండ. తర్వాత లాక్ డౌన్ టైం లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘ సినిమా ద్వారా మొదటి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా మంచి టాక్ సంపాదించింది. ప్రస్తుతం హోమ్ బ్యానర్ లో ‘పుష్పక విమానం’ అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఒక లో-బడ్జెట్ ఫామిలీ మరియు లవ్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమా నుండి ‘కళ్యాణం’ అనే పాటని రేపు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘సమంత’ విడుదల చేయనున్నారు. ఈ రోజు ఈ పాట కి సంబందించిన ప్రోమో ని విడుదల చేసారు.
ఈ పాట సినిమాలో పెళ్ళికి సంబందించిన సందర్భంలో వచ్చే పాటలాగా ఏర్పడుతుంది. ఈ పాటని టాలీవుడ్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. ప్రోమో చూసిన తర్వాత సిద్ పాటలన్నిటి లాగానే ఈ పాట కూడా హిట్ లిస్ట్ లోకి చేరే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. లుక్స్ పరంగా ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ కొంచెం మెరుగయ్యాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో సింగర్ రామ్ మిరియాల సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కింగ్ అఫ్ హిల్ మరియు తంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ సినిమాని నిర్మించారు. దామోదర అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. కరోనా వేవ్ 2 ముగిసి థియేటర్లు మొదలవగానే విడుదలయ్యే మొదటి వరుస సినిమాల్లో ఈ సినిమా కూడా ఉంది.