టాలీవుడ్: ‘దొరసాని’ సినిమాతో తెలుగు సినిమా కి పరిచయం అయిన నటుడు ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ తమ్ముడిగా జర్నీ ప్రారంభించి లాక్ డౌన్ సమయంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో గుర్తింపు పొందాడు. ఇపుడు అన్న స్థాపించిన కింగ్ అఫ్ హిల్ బ్యానర్ లో కమల్ హాసన్ క్లాసిక్ టైటిల్ ‘పుష్పక విమానం’ అనే సినిమాతో రానున్నాడు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి పాత్రలో నటించనున్నట్టు అర్ధమవుతుంది. ఎస్.వీ.కృష్ణ రెడ్డి సినిమాల్లో జగపతి బాబు లుక్ ని పోలి ఉంది ఆనంద్ దేవరకొండ లుక్. ఈ సినిమా నుండి ‘సిలకా’ అనే పాట ఇదివరకు విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ రోజు ఈ సినిమా నుండి ‘కళ్యాణం‘ అంటూ సాగే పాటని సినీ నటి ‘సమంత’ విడుదల చేసారు. సినిమాలో హీరో పెళ్లి నేపధ్యం లో ఈ పాట రానున్నట్టు లిరికల్ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమాతో ప్రముఖ సింగర్ రామ్ మిరియాల సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రామ్ మిరియాల కంపోసిషన్ లో సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట మంచి మెలోడీ గా గుర్తింపు తెచ్చుకుంటుంది. కింగ్ అఫ్ హిల్ మరియు తంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ సినిమాని నిర్మించారు. దామోదర అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసి థియేటర్లు తెరచుకోగానే ఈ సినిమా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.