టాలీవుడ్: అ!, కల్కి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇపుడు మరొక కొత్త రకమైన సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. చనిపోయిన మనిషి వైరస్ రూపంలో విహరిస్తూ అందరినీ హరించడం లాంటి సినిమాలు హాలీవుడ్ లో చాలానే చూసాం. ఇండియన్ సినిమాలో ఈ జానర్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. తెలుగులో ఈ జానర్ లో ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్న తేజ్ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. దసరా సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు సినిమా టీం. అమ్మవారి గెటప్ లో హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
తెలుగులో బస్ స్టాప్ లాంటి సినిమా చేసి ఆ తర్వాత తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆనంది (రక్షిత). చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో ఈ సినిమా ద్వారా మనముందుకు వస్తుంది. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా కూడా ఇక్కడ అంతగా గుర్తింపు పొందలేదు. ఈ సినిమా ద్వారా సక్సెస్ సాధించి తెలుగు లో కూడా బిజీ అవుదామని ప్రయత్నాలు చేస్తుంది. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్ పై రాజ శేఖర్ వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.