టాలీవుడ్: తెలుగు యాంకర్ గా , క్రియేటివ్ హెడ్ గా ప్రదీప్ తెలుగు వాళ్ళకి బాగా పరిచయమే. కొన్ని సినిమాల్లో కూడా హీరో ఫ్రెండ్ కారెక్టర్లలో నటించాడు. ప్రదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా జనవరి చివర్లో థియేటర్లలో విడుదలైంది. 2020 లో లాక్ డౌన్ విధించినప్పుడు మొదట ఎఫెక్ట్ పడిన సినిమా ఇది. అపుడు ఈ సినిమాని ఓటీటీ లో విడుదలవుతుంది అని ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా ప్రొడ్యూసర్స్ వెనకడుగు వేయకుండా థియేటర్లు తెరుచుకున్న తర్వాత జనవరి లో విడుదల చేసారు. సినిమా మిక్స్డ్ టాక్ తో పరవాలేదనిపించింది. అంతగా కలెక్షన్స్ కూడా సాధించలేదు.
అయితే సెకండ్ వేవ్ లాక్ డౌన్ వరకు విడుదలైన అన్ని సినిమాలు ఓటీటీ లో విడుదలైనా కూడా ఈ సినిమా మాత్రం ఓటీటీ లో రిలీజ్ కాలేదు. ఎట్టకేలకు ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. డిజిటల్ హక్కుల మధ్య డిస్కషన్స్ ఫెయిల్ అవడం తో ఇన్ని రోజులు విడుదల కానీ ఈ సినిమా చివరకి అమెజాన్ ప్రైమ్ వీడియో తో ఒప్పందం కుదుర్చుకుని ఓటీటీ లో విడుదల చేసారు. ప్రదీప్ హీరోగా, బిగిల్ ఫేమ్ అమ్రిత అయ్యర్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.