అండమాన్: తాజాగా అండమాన్ నికోబార్ దీవుల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావును సీఎం చంద్రబాబు నియమించడం గమనార్హం. ఈ నియామకంతో పార్టీ మరింత బలోపేతం కానుందని చంద్రబాబు ఆశిస్తున్నారు.
అండమాన్‌లో టీడీపీ పునాదులు 2010 నుంచే వేర్చుకుంది. 2010 స్థానిక సంస్థల ఎన్నికల్లో 4 శాతం ఓట్లు దక్కించుకోవడం, 2015లో 12 శాతం ఓట్లు సాధించడంతో బలమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది.
2022లో అండమాన్ మునిసిపాలిటీ ఎన్నికల్లో 14 శాతం ఓట్లు సాధించిన టీడీపీ బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఈ గెలుపు స్థానికంగా పార్టీకి కొత్త జవసత్వాలు అందించింది.
తాజాగా నక్కల మాణిక్యరావు అధ్యక్షుడిగా నియమితులవడంతో, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత పుంజుకోనుంది. మునుపటి అనుభవంతో పార్టీ మునిసిపాలిటీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించనుందని ఆశిస్తున్నారట.
చంద్రబాబు నాయకత్వంలో టీడీపీకి ఉన్న కేడర్, బలమైన బేస్ అండమాన్ ప్రాంతంలో కూడా విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి బీజేపీతో కలసి అభివృద్ధి సాధించడం టీడీపీకి మైలురాయి. నక్కల మాణిక్యరావు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, పార్టీకి మరింత బలం చేకూర్చనుంది.