టాలీవుడ్: ఇపుడు చాలా మంది పెద్ద డైరెక్టర్స్ నిర్మాతలుగా మరి తమ దగ్గరికి వచ్చిన మంచి కథల్ని చిన్న బడ్జెట్ లో రూపొందిస్తున్నారు. ఇదివరకు డైరెక్టర్ శంకర్, త్రివిక్రమ్, మురుగదాస్ ఇలా కొన్ని చిన్న సినిమాలని రూపొందించి విజయవంతం అయ్యారు. ఇపుడు వీరి బాటలోనే ‘రాజా రాణి’, ‘అదిరింది’, ‘పోలీసోడు’ సినిమాలని డైరెక్ట్ చేసిన ‘అట్లీ‘ కూడా ప్రొడ్యూసర్ గా మారి ‘అంధకారం’ అనే సినిమాని రూపొందించాడు. తాను సమర్పకుడిగా మారి తన భార్య ప్రియా ని ఒక ప్రొడ్యూసర్ గా పెట్టి ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఇవాళ విడుదలైంది.
ఈ సినిమా ట్రైలర్ థ్రిల్లర్ జానర్ లో రూపొందింది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ కథనం తో ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో తన జీవిత మనుగడ కోసం ఒక అంధుడి పోరాటం, కొన్ని వివాదాల వల్ల ఆట ముగిసిపోయిన ఒక క్రికెటర్ కథ అలాగే మరో సైకియాట్రిస్ట్ కథ ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ లో చూపించిన సౌండింగ్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి ప్రదీప్ కుమార్ సంగీతం అందించారు.ఎడ్విన్ సాకీ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించారు. విజ్ఞరాజన్ అనే దర్శకుడు ఈ సినిమాకి కథ మరియు దర్శకత్వం అందించారు.
కార్తీ నటించిన నా పేరు శివ లో విలన్ గా నటించిన ‘వినోద్ కిషన్’ అంధుడి పాత్రలో నటించాడు. అలాగే అంధుల స్కూల్ టీచర్ గా స్వామి రారా ఫేమ్ ‘పూజా రామచంద్రన్’ నటించింది. క్రికెటర్ పాత్రలో కార్తీ ‘ఖైదీ’ సినిమాలో విలన్ గా నటించిన ‘అర్జున్ దాస్’ నటించి మెప్పించారు. ఈ సినిమా నవంబర్ 14న నెట్ ఫ్లిక్ ఓటీటీ లో విడుదల అవబోతుంది.