ఏపీ: డీజీపీ ద్వారకా తిరుమల రావు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఇటీవల జరిగిన భేటీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా, డీజీపీలు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మాత్రమే టచ్‌లో ఉంటారు.
హోం శాఖలో కీలకమైన శాంతి భద్రతల విభాగం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఉండటంతో, పవన్ కల్యాణ్‌తో డీజీపీ భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడుతున్నాయంటూ, హోం మంత్రిగా తానే ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది.
ఈ క్రమంలో చంద్రబాబు, పలు భద్రతా వ్యవహారాలు పవన్‌కు అప్పగించే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా, డీజీపీ భేటీ దీని సంకేతమని అనిపిస్తోంది.
అదేవిధంగా, సోషల్ మీడియాలో చెలరేగిన వారిపై చర్యలు తీసుకోవడం, హైకోర్టు అక్రమ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి పరిణామాలు కూడా ఈ భేటీకి ప్రాధాన్యతను తెచ్చాయి. ప్రస్తుతం పవన్‌కు శాంతి భద్రతా బాధ్యతలు అప్పగిస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.