fbpx
Saturday, October 19, 2024
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్‌ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

ఆంధ్రప్రదేశ్‌ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

Andhra-Pradesh-Kasturba-Gandhi-Girls-Vidyalayas-Notification-Released

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (KGBV) టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్ష సొసైటీ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసి, 604 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులు 2024-25 విద్యా సంవత్సరానికి, అంటే ఏడాది కాలానికి ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్‌ బేసిస్‌) మరియు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది.

మొత్తం 604 ఖాళీల్లో ప్రిన్సిపల్ పోస్టులు 10, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT) పోస్టులు 165, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (PET) పోస్టులు 4, సీఆర్టీ (CRT) పోస్టులు 163, పార్ట్ టైం టీచర్‌ (PTT) పోస్టులు 165, వార్డెన్ పోస్టులు 53, అకౌంటెంట్ పోస్టులు 44 ఉన్నాయి.

పోస్టు ఆధారంగా విద్యార్హతలు నిర్ణయించబడ్డాయి. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన జీతాలు కూడా ప్రకటించబడ్డాయి. ప్రిన్సిపాల్‌ పోస్టులకు నెలకు రూ.34,139, పీజీటీ, సీఆర్టీ, పీఈటీ పోస్టులకు రూ.26,759 జీతం చెల్లిస్తారు.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 26న ప్రారంభమై, అక్టోబర్‌ 10 వరకు కొనసాగుతుంది. కేవలం మహిళలకే చెందిన ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular