విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇకపై కేవలం ఈ-గెజిట్ ద్వారానే ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని ఇవాళ నిర్ణయించింది. దేశంలో అమలు లో ఉన్న పౌర సమాచార హక్కు చట్టం యొక్క ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా ఏపీ ఇక పై తమ అధికారిక ఉత్తర్వులన్నింటినీ ఈ-గెజిట్‌లోనే ఉంచనున్నట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
కాగా ఇకపై రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం అవసరం లేని సమాచారాన్ని ఏపీ తమ ఈ-గెజిట్‌లో ఉంచబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ బుధవారం దీనికి సంబంధించి ఆదేశాలను జారీ చేశారు.