fbpx
Sunday, November 24, 2024
HomeAndhra Pradeshఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన: వాతావరణ శాఖ!

ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన: వాతావరణ శాఖ!

ANDHRAPRADESH-GETS-HEAVY-RAINFALL-SAYS-WATHER-FORECAST-DEPARTMENT

విశాఖ: రానున్న 48 గంటల్లో ఏపీలోని ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే దక్షిణ కోస్తాలో కూడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. అలాగే ఈ సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్ల కూడదని కూడా హెచ్చరించింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతూనే ఉందని, అందువల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు భారీ స్థాయిలో కురుస్తాయని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ ఉపరితల ఆవర్తనం వల్ల ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి. జిల్లాలో సగటున 13.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జంగారెడ్డిగూడెంలో అత్యధికంగా 70.4 మి.మీ. వర్షపాతం నమోదు కాగా ఏలూరులో 51.4 మి.మీ. కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ పలుచోట్ల వర్షాలు పడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular