fbpx
Tuesday, February 11, 2025
HomeMovie Newsచిరుతో అనిల్ రావిపూడి.. ‘సంక్రాంతి అల్లుడు’ ఫిక్స్ అయిందా?

చిరుతో అనిల్ రావిపూడి.. ‘సంక్రాంతి అల్లుడు’ ఫిక్స్ అయిందా?

ANIL-RAVIPUDI-CHIRANJEEVI-NEW-MOVIE-FOR-SANKRANTHI
ANIL-RAVIPUDI-CHIRANJEEVI-NEW-MOVIE-FOR-SANKRANTHI

మూవీడెస్క్: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఇటీవల సంక్రాంతికి వస్తున్నాంతో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు.

వెంకటేష్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన అనిల్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని, ఇందులో చిరు వింటేజ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం.

తాజాగా ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

చిరంజీవి సూపర్ హిట్ సినిమా రౌడీ అల్లుడు తరహాలో ఈ సినిమాలోనూ చిరు మాస్ అవతారం దుమ్ములేపుతుందని టాక్.

ఇప్పటికే అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైటిల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఈసారి కూడా సంక్రాంతి అల్లుడు టైటిల్ ఫిక్స్ అయితే, ఇది అభిమానులలో భారీ అంచనాలు నెలకొల్పేలా ఉంది.

అయితే ఈ టైటిల్ నిజమేనా? అనేది అనిల్ రావిపూడి లేదా చిత్రబృందం అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది.

చిరు – అనిల్ కాంబోలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్ రాబోతుందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular