మూవీడెస్క్: గతేడాది డిసెంబర్‌లో విడుదలైన యానిమల్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మూడు గంటల 21 నిమిషాల పాటు ఒక్కసారిగా కూడా బోర్ కొట్టకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఫాదర్-సన్ ఎమోషన్స్‌తో మేళవించిన ఈ యాక్షన్ డ్రామా 900 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
యానిమల్ క్లైమాక్స్‌లో చూపించిన సీక్వెల్ క్లూ, “యానిమల్ పార్క్” టైటిల్‌తో ప్రేక్షకులను మళ్ళీ ఉత్కంఠలో ముంచేసింది.
తాజాగా రణబీర్ కపూర్ ఈ సీక్వెల్ గురించి మరింత ఆసక్తికర సమాచారం వెల్లడించాడు. యానిమల్ సీక్వెల్‌తో పాటు, మూడో భాగం కూడా వస్తుందని చెప్పాడు.
అయితే, ప్రస్తుతం ఇద్దరికీ ఉన్న ప్రాజెక్ట్స్ కారణంగా యానిమల్ పార్క్ 2027కి ముందు ప్రారంభం కాని అవకాశముందని పేర్కొన్నాడు.
అలాగే, మూడో భాగం కూడా “యానిమల్ కింగ్‌డమ్” పేరుతో వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.
ఈ సీక్వెల్‌లో యానిమల్ యూనివర్స్‌ను మరింత హింసాత్మకంగా, డార్క్‌గా మార్చే అవకాశం ఉందని సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే హింట్ ఇచ్చాడు.
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో మెరిసిన ఈ ఫ్రాంచైజ్ కొనసాగింపు ఆడియన్స్‌ను మరింత థ్రిల్ చేయనుంది.