మూవీడెస్క్: తమిళ చిత్రసీమలో అనిరుధ్ సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ను అందుకుంటూ, వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న అనిరుధ్.
తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాలను మించి ప్రదర్శన ఇస్తూ వచ్చాడు. ‘జైలర్’, ‘లియో’, ‘జవాన్’ వంటి హిట్లకు సంగీతం అందించి ప్రేక్షకులను అలరించాడు.
అలాగే, ‘దేవర’ మూవీకి కూడా అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మిక్స్డ్ రివ్యూలు వచ్చినా, అనిరుధ్ మ్యూజిక్ తో సినిమాకు అదనపు బలం వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా 500 కోట్లకి పైగా వసూళ్లు సాధించి విజయవంతంగా థియేటర్లలో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, అనిరుధ్ సక్సెస్ అయిన ప్రతి సినిమాకు ట్విట్టర్ లో ఒక ప్రత్యేక ట్వీట్ చేస్తూ ‘బ్లాక్ బస్టర్’ అంటూ పబ్లిక్ లో చెప్పడం అలవాటుగా మారింది.
అయితే, రజినీకాంత్ తాజా చిత్రం ‘వేట్టయన్’ విషయంలో మాత్రం ఈసారి అంచనాలు తారుమారు అయ్యాయి.
అనిరుధ్ బ్లాక్ బస్టర్ అని చెప్పిన ఈ సినిమా విడుదలైన వెంటనే మిక్స్డ్ రివ్యూలు సొంతం చేసుకుని, కలెక్షన్లు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.
ఈ సారి మాత్రం అనిరుధ్ అంచనాలు తప్పాయని టాక్ వినిపిస్తోంది.