
సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ టీజర్ కి అద్భుతమైన బీజీఎం ఇచ్చి ఆ టీజర్‌ను మరింత ఎలివేట్ చేశాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చేసిన కట్ లో కథ ఎక్కువగా రివీల్ కాకపోయినా, అనిరుద్ సంగీతం స్పెషల్ హైలైట్ గా నిలిచింది.
ఇక అదే డైరెక్టర్ కాంబోలో వస్తోన్న ‘మేజిక్’ సినిమా ఫస్ట్ లిరికల్ వీడియో కూడా రిలీజ్ అయింది. వ్యూస్ కాస్త స్లోగా ఉన్నా, సాంగ్ పక్కా స్లో పాయిజన్ అంటూ ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రీ-రికార్డింగ్ కూడా అనిరుద్ చేతుల్లోనే ఉంది.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న ‘ది ప్యారడైజ్’ టీజర్ మార్చి 3న రాబోతోంది. ఈ టీజర్‌లో అనిరుద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచుతోందట.
తెలుగులో వీటితో పాటు చిరంజీవి-ఓదెల, బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమాలు కూడా అనిరుద్ ఖాతాలోకి వచ్చాయనే టాక్ ఉంది. తమిళంలోనూ విజయ్ ‘జననాయకన్’, రజినీకాంత్ ‘జైలర్ 2’, కార్తీ ‘ఖైదీ 2’ వంటి పెద్ద సినిమాలతో అనిరుద్ హవా కొనసాగుతోంది.