మూవీ డెస్క్: అంజలీ నటించిన వెబ్ సిరీస్ బహిష్కరణ చిత్రం ఇటీవల స్ట్రీం అవుతోంది. నటీమణులు వేశ్య పాత్రలు చేసి కొత్త గుర్తింపుతో పాటు అవార్డులు కూడా గెలుచుకుంటున్నారు.
అలనాటి మేటి నటి అయిన వహీదా రెహ్మాన్ నుండి నేటి నటులు అలియా భట్ వరకు వేశ్య పాత్రల్లో మెరిసిన తారల లిస్టు విస్తృతంగా ఉంది. తెలుగులో సావిత్రి మధురవాణి పాత్రలో చేసిన నటన, వేదంలో అనుష్క పాత్ర ఆమె కెరీర్ లో ప్రత్యేకమైనదిగా నిలిచింది.
తాజాగా గాంగ్స్ ఆఫ్ గోదావరిలో అంజలి తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుత బహిష్కరణ వెబ్ సిరీస్ లోనూ అంజలి మరో సాహసవంతమైన పాత్రలో కనిపించింది.
1990లో గుంటూరు జిల్లా పెద్దపల్లిలో సర్పంచ్ శివయ్య రాచరిక పద్ధతులతో ప్రజలను తన ఆదేశాలకు బానిసలుగా ఉంచుకుంటాడు.
పుష్ప అనే వేశ్య అతని దగ్గర ఉంటూ జీవనం సాగిస్తుంది. పుష్ప, దర్శి మధ్య ప్రేమ పెరుగుతుంది. శివయ్య వీరి ప్రేమకు అడ్డంకిగా మారతాడు. ఈ నేపథ్యంలో దాడులు, ప్రతీకారాలతో కథ ముందుకు సాగుతుంది.
ఈ సిరీస్ పిరియాడికల్ రివెంజ్ డ్రామాగా రూపొందినప్పటికీ, పాత్రల మధ్య నాటకీయతను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు ముఖేష్ ప్రజాపతి తన ప్రతిభను ప్రదర్శించారు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రారంభమైన ఈ సిరీస్, నాటకీయ మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంజలి, శ్రీతేజ్, అనన్య, రవీంద్ర విజయ్ తదితరులు తమ పాత్రలను చక్కగా నటించారు.
పిరియాడిక్ డ్రామాగా ఉండటంతో, నాటి పరిస్థితులకు అనుగుణంగా ప్రదర్శించారు. కెమరా పనితనం, సంగీతం డీసెంట్ గా ఉన్నాయి.
ఈ సిరీస్ మరీ అంత ఫ్రెష్ గా కాకపోయినా, రా & రస్టిక్ కంటెంట్ ను ఇష్టపడేవారికి నచ్చే అవకాశముంది.